బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన బురదమయంగా మారిన రోడ్డును పునరుద్ధరించాలని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు డిమాండ్ చేశారు. వరినాట్లు వేసి నిరసన తెలిపారు. మహబూబాబాద్-సూర్యాపేట జిల్లాలను కలిపే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందన్నారు. వాహనాలు బురదలో ఇరుక్కుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి:గలగలల దాల్ సరస్సు కళ తప్పెనే!