మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం శివారులోని కాటన్ మిల్లులో ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మద్దతు ధరను పొందేందుకు వివిధ మండలాల నుంచి రైతులు కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొస్తున్నారు. పత్తిని సకాలంలో కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ పేరుతో తీసుకువచ్చిన పత్తిని విక్రయించేందుకు అధికారులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళారుల రాజ్యం
కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద దళారుల రాజ్యం నడుస్తోందని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల పత్తిని కొనుగోలు చేయడం లేదని అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు