కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు చేయూత అందించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్ రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామచందర్ నాయక్ చేతులమీదుగా పేదలు, కూలీలకు నిత్యావసర సరకులు, కూరగాయలు అందజేశారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పార్టీ అధ్యక్షులు సూచించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రేమకు నిదర్శనం.. కొడుకులందరికీ భాషా ఆదర్శం