మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధిలో భూక్యా రాములు అనే రైతు తన వ్యవసాయ భూమిలో 12 క్వింటాళ్ల మిర్చిని పండించాడు. అనంతరం పంటంతా చేనులో నిల్వ చేశాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చికుప్పకు నిప్పు పెట్టారు.
కల్లంలో నిల్వ చేసిన 12 క్వింటాళ్ల మిర్చి పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్న బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనలో రూ.1.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి : కొండపోచమ్మ నిర్వాసితులకు తాత్కాలిక నివాసాలివ్వండి : హైకోర్టు