ETV Bharat / state

'ఉత్తమ గ్రామ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు'

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మహబూబాబాద్​ జిల్లాలో ఉత్తమ పనితీరును ప్రదర్శించిన గ్రామ పంచాయితీలకు కలెక్టర్​ ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా 10 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేశారు.

author img

By

Published : Dec 10, 2020, 5:21 AM IST

Cash incentives for the best gram panchayats in mahabubabad district
'ఉత్తమ గ్రామపంచాయతీలకు నగదు ప్రోత్సహకాలు'

మహబూబాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆదర్శంగా నిలిచిన గ్రామాలకు కలెక్టర్ గౌతం ప్రోత్సహకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను సత్కరించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచే నూతన కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు.

జిల్లాలో ఉత్తమ పనితీరును చూపించిన దంతాలపల్లి మండలంలోని లక్ష్మీపురం సర్పంచ్ తారమ్మ, సెక్రెటరీ వెంకన్న... డోర్నకల్ మండలంలోని బొడ్రాయి తండా గ్రామ సర్పంచ్ గమ్మీ, సెక్రెటరీ ప్రవీణ్​లకు శాలువాలు కప్పి సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. 10 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదును పంపిణీ చేశారు.

అవార్డు అందుకున్న గ్రామాల్లో చెత్త సేకరణ, శ్మాశనవాటికల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు నిర్ణీత సమయంలో నిర్మించడమే కాకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచడం... తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్​ అన్నారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో పోటీతత్వం పెంచేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లత, ముఖ్య ప్రణాళిక అధికారి కొమరయ్య , తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'న్యాయం చేయకుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.