తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సీఎం కేసీఆర్ పోరాడి తీసుకురావాలని భాజపా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ సీతారామరాజు డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన గోదావరి నదీ జలాల వాటా 525 టీఎంసీలు కాగా మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 250 టీఎంసీల వాటా కోసం మాత్రమే సీఎం సంతకం చేయడాన్ని ఖండించారు.
కేసీఆర్ వైఖరి నిరసిస్తూ మణుగూరు పట్టణంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన నదీజలాలపై తెరాస ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని కోరారు. ఏపీతో కేసీఆర్ కుమ్మకై తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: అపెక్స్ కౌన్సిల్ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించాం: షెకావత్