సుమారు రూ.25 కోట్లు నష్టం...
గిడ్డంగిలోని ఏ, బీ బ్లాక్‌లలో ఉన్న సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. బీ, సీ బ్లాక్‌లలో ఉన్న బస్తాలను అందుబాటులో ఉన్న రైతులు వాహనాలలో ఇతర ప్రాంతాలకు తరలించారు. మిర్చి ఘాటుతో అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్వాహకులలో ఒకరైన శ్రీనివాస్ అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదంలో సుమారు రూ.25 కోట్ల నష్టం సంభవించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఆందోళనలో రైతులు...
నిల్వ చేసుకున్న పంటలకు ఇన్సూరెన్స్ వస్తుందని... రైతులు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని నిర్వాహకులు ధైర్యం చెబుతున్నారు. తాము నిల్వ చేసుకునే సమయంలో ఉన్న ధరతో సంబంధం లేకుండా ప్రస్తుత ధరతోనే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల భరోసా...
కలెక్టర్ శివలింగయ్య, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ , డీఎస్ రెడ్యానాయక్, హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతులను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?