కోవిడ్ టీకాల పంపిణీకి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని దంతాలపల్లి మరిపెడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె సందర్శించారు.
ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన రెండో విడత కోవిడ్ టీకాల పంపిణీ కేంద్రాలను పరిశీలించి.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు కేంద్రాల్లో టీకాలు వేయించుకునే వారికి ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. వ్యాక్సిన్ నిలువపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: '2024 వరకైనా ఉద్యమం కొనసాగిస్తాం'