ETV Bharat / state

మాస్కు ధరించని అధికారికి జరిమానా విధించిన కలెక్టర్​

మాస్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు గ్రామస్థాయి అధికారులు మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించని వారికి గ్రామపంచాయతీ వారు జరిమానాలు విధిస్తారు. ఈ విషయాన్ని అధికారులే విస్మరిస్తే.. వారికెవరు జరిమానా విధిస్తారనే అనుమానాన్ని తొలగించారు జిల్లా పాలనాధికారి. మాస్కు ధరించని ఓ పంచాయతీ కార్యదర్శికి జిల్లా కలెక్టర్‌ రూ.500 జరిమానా విధించిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో చోటు చేసుకుంది.

author img

By

Published : Jul 23, 2020, 11:15 PM IST

A fine for an officer does not wear a mask at mahabubabad district
మాస్కు ధరించని అధికారికి జరిమానా విధించిన కలెక్టర్​

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు అమలు చేయాలి. కానీ ఓ ప్రభుత్వ అధికారి మాస్కు ధరించలేదని అతనికి మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్ ఫైన్​ వేశారు. వివారాల్లోకి వెళితే మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కాంపెల్లి, ఉప్పరిగూడెం, తాళ్ల సంకీస, నేరడ గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పర్యటించారు. ఆయా గ్రామాల్లో చేట్టిన రైతు వేదికల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురగోతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మాస్కు తీసి..

ఈ క్రమంలో తాళ్లసంకీస గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్‌.. కారు దిగిన సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ మాస్కు తీసి కలెక్టర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కలెక్టర్‌ అతడిని మాస్కు లేకుండా ఎందుకు వస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కు ధరించకుంటే జరిమనా ఎంతో తెలుసా అంటూ అతడిని మందలించాడు. వెంటనే గ్రామపంచాయతీకి సంబంధించిన బిల్​బుక్‌ను తెప్పించి అతడితోనే రూ.500 జరిమానా రాయించారు. సర్పంచి సుగుణమ్మకు నగదు అందజేసి రశీదును ఇప్పించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 50 వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.