కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బొరిగాం శివారులోని పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. గ్రామ శివారులో గత కొంతకాలంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 22 వేల 4 వందల నగదు, 6 ఫోన్లు, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.