కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని ఇస్గన్ శివమల్లన్న స్వామి ఆలయంలో షష్టి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్గశిర మాసంలో నాలుగు వారాల పాటు జరిగే ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై.. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
కాగజ్‌నగర్‌తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు ఈ ఉత్సవాలల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉదయాన్నే ఆలయానికి చేరుకుంటారు. బెల్లం, పాయసం, అన్నం కూరగాయలతో బోనం చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. అనంతరం కోరమీసాల స్వామిని దర్శించుకుంటారు.
ఇదీ చదవండి: జగిత్యాల మల్లన్న ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు