30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ అమలులో ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యక్రమంలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం రెబ్బెనలో నాయకులు పర్యటించారు. గుంతలు పడిన రహదారులపై మట్టి పోసి పూడ్చారు. వీధుల్లో పర్యటిస్తూ... ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వనిత, ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి బండి శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ బడ్జెట్... రూ.1,46,492.3 కోట్లు