కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 15 మండలాల్లోని వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలోని కుమురం భీం, వట్టివాగు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నీటిమట్టం పెరిగింది. ప్రధానంగా కుమురం భీం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వస్తుండడం వల్ల అధికారులు అప్రమత్తమై స్పిల్వే 3 గేట్లను మూడు అడుగుల మేరకు ఎత్తి నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 241.1 మీటర్లకు చేరింది. భారీ వర్షాల కారణంగా 5వేల 80 క్యూసెక్కుల వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి: మాస్టర్ ప్లాన్ సమర్పించండి: హైకోర్టు ఆదేశం