ETV Bharat / state

'మొక్కలు నాటడమే కాదు... వాటి సంరక్షణ బాధ్యతలూ తీసుకోవాలి' - sirpur MLA koneru konappa latest news on haritha haram

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సిర్పూర్ కాగజ్​నగర్​​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని బస్టాండ్​ ప్రాంతంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డ్​లు, కర్రలతో రక్షణ కల్పించాలని సూచించారు.

'Not just planting the plants ... also taking care of them' said by sirpur MLA konnappa
'మొక్కలు నాటడమే కాదు... వాటి సంరక్షణ బాధ్యతలూ తీసుకోవాలి'
author img

By

Published : Jun 25, 2020, 7:21 PM IST

హరితహారంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు... వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని అన్నారు సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, కమిషనర్ శ్రీనివాస్, ఎఫ్​డీఓ విజయ్ కుమార్​లతో కలిసి మొక్కలు నాటారు.

ఆరో విడత హరితహారంలో భాగంగా కాగజ్​నగర్ పురపాలిక పరిధిలో 3,74,000 మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణంలో రహదారులకు ఇరువైపులా, శ్మశాన వాటికలు, ఖాళీ ప్రదేశాల్లో 2,00,000 మొక్కలు నాటేందుకు విస్తృత ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. మిగిలిన 1,74,000 మొక్కలు ఇంటి పరిసరాల్లో నాటేందుకు... ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వాతావరణ సమతుల్యత సాధించే దిశగా నాటిన మొక్కలకు ట్రీ గార్డ్​లు, కర్రలతో రక్షణ కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి : హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.