భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వ విధానాలపై ఆయన విమర్శల వర్షం గుప్పించారు.
భారతదేశం ఏ ఒక్క మతానికి సొంతం కాదని... డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయని వెల్లడించారు. ముస్లిం మైనార్టీ సోదరులు అంతా కలిసి ఎంఐఎం అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.
ఇవీచూడండి : ఎంఐఎం చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ: కిషన్ రెడ్డి