ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు ఇంటర్మీడియట్​ పరీక్ష

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​లో ఇంటర్మీడియట్​ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థుల​ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

author img

By

Published : Mar 4, 2020, 1:51 PM IST

first year intermediate students first day exam completed in peacefully
ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు ఇంటర్మీడియట్​ పరీక్ష

కుమురంభీం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్​ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగజ్​నగర్​లో ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల కోసం అధికారులు పట్టణంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు కేంద్రాల్లో, వివేకానంద జూనియర్ కళాశాల, భాలభారతి జూనియర్ కళాశాలల్లో పరీక్షలను నిర్వహించారు.

1,442 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 898 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.

మొదటి రోజు పరీక్షకు ఒక విద్యార్థిని 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందున ఆమెను అధికారులు పరీక్షహాల్లోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.