కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని నజృల్ నగర్ పంచాయతీలోని పేదలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సుమారు 180 మంది పేదలకు 20 రోజులకు సరిపడా సరుకులను అందించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. కరోనా మహమ్మారిని నివారించాలంటే ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హరిదాస్ సర్కార్, కోశాధికారి ప్రశాంత్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా నిలిచిన లయన్స్ క్లబ్ - Distribution of Essential Commodities under Lion's Club For Poor peoples in Khakaznagar, Kumuram Bhim district
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవటానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. కాగజ్‌నగర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 180 మంది పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
పేదలకు అండగా లయన్స్ క్లబ్

TAGGED:
పేదలకు అండగా లయన్స్ క్లబ్