Kumuram Bheem project: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి జిల్లాలోని ప్రముఖ కుమురం భీం ప్రాజెక్ట్ ముప్పు పొంచి ఉంది. జలాశయం ఆనకట్టకు పగుళ్లు రావడంతో ప్రమాదంగా మారింది. ప్రాజెక్ట్‌కు ముప్పు పొంచి ఉండటంతో దిగువ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆనకట్టపై అధికారులు సుమారు 400 మీటర్ల ప్లాస్టిక్ కవర్ కప్పి కాపాడే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.
ప్రపంచంలోనే ఇప్పటివరకు ఈ విధంగా ఏ ప్రాజెక్టు ఆనకట్టకు కూడా ప్లాస్టిక్ కవర్ కప్పి ఆపడం అనేది జరగలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అటు ఫారా ఫిట్‌వాల్ దెబ్బతినడంతో నీరు లీకవుతోంది. వరద ఉద్ధృతికి ఆనకట్ట కోతకు గురవుతోంది. నీటిలోకి బండ రాళ్లు జారిపడుతున్నాయి. ప్రాజెక్ట్‌కు ముప్పు పొంచి ఉండటంతో దిగువ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: CM KCR Speech : 'ఐకమత్యంతో జాతి ఔన్నత్యం చాటాలి'
ఆస్పత్రిలో అర్ధరాత్రి బర్త్‌డే పార్టీ.. బెల్టులతో కొట్టుకుంటూ అల్లరి!