పల్లెప్రగతి స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పాలకులు కృషిచేయాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తల్లాడ మండలంలో 16 పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
30 రోజుల ప్రణాళికతో తొలి విడత పనులు చేపట్టారని, నిరంతర ప్రక్రియగా మరోసారి పల్లెప్రగతి అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో పల్లెలు కొత్తదనం చాటుతున్నాయన్నారు. పంచాయతీ పాలకులతోపాటు ప్రజలు తమ ప్రాంతాలు ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో ఉండాలని వెంకటవీరయ్య పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మహా శివరాత్రికి ముస్తాబైన రామేశ్వరం