ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు యువకులు మృతి చెందారు. పక్కపక్కనే ముగ్గురు చనిపోవటం వల్ల కాలనీ అంతా విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో అంతా మారుమోగింది. మృతదేహాలకు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, స్థానిక నాయకులు మృతదేహాలకు నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు