ఆర్టీసీ కార్మికుల మూడో రోజు సమ్మె ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కొనసాగింది. ఉదయం నుంచి డిపో కార్యాలయం, డిపో రోడ్డులో కార్మికుల ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తింది. ఉదయం డిపో ముందు ధర్నా నిర్వహించి ర్యాలీ తీస్తుండగా నగర మేయర్ డా.పాపాలాల్ వాహనం ఎదురవగా కార్మికులు అడ్డగించారు. ఉద్రిక్తతల నడుమ కారు తీస్తుండగా ప్రమాదవ శాత్తు మేయర్ కారు టైరు ఓ కార్మికుడి కాలిపై నుంచి వెళ్లింది. కార్మికుడికి తీవ్ర గాయాలు అవడం వల్ల పోలీసులు కల్పించుకుని సర్ది చెప్పారు. అమరవీరుల స్తూపం వద్ద నినరసన ప్రదర్శించిన అనంతరం ర్యాలీగా బయలుదేరారు. మయూరి కూడలి వరకు ర్యాలీ తీసి డిపో వద్దకు చేరుకున్నారు. ఉద్యమంలో కేసీఆర్తో తాడో పేడో తెల్చుకుంటామని కార్మికులు స్పష్టం చేశారు.
ఖమ్మంలో ఉద్రిక్తత నడుమ మూడో రోజు సమ్మె - undefined
ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్మికులు మూడో రోజు సమ్మె నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ కార్మికుడికి తీవ్ర గాయాలై ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది.