రేపటి జనతా కర్ఫ్యూను ప్రజలందరూ పాటించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో రేపు మెడికల్ షాపులు మినహా ఏ ఒక్క దుకాణం తెరిచి ఉండదని స్పష్టం చేశారు. ప్రజలందరూ అవగాహన కలిగి ఉండి సహకరించాలన్నారు. ఎవరూ బయటకు రావద్దని సూచించారు.
జిల్లాలో విదేశాల నుంచి 180 మంది వచ్చినట్టు గుర్తించామన్నారు. ఒకరికి లక్షణాలు ఉండగా పరీక్షలు నిర్వహించిన తర్వాత అది కూడ నెగిటివ్ వచ్చిందన్నారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్‌లో కరోనా లక్షణాలు ఉన్న రోగులకు చికిత్స అందించేందుకు గానూ ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు