ETV Bharat / state

ఖమ్మం నగరపాలికకు నగారా.. సిట్టింగుల గుండెల్లో గుబులు - sitting corporators afraid of Redistribution of divisions

ఖమ్మం నగరపాలక సంస్థకు త్వరలో మోగనున్న ఎన్నికల నగరా.. సిట్టింగ్ కార్పొరేటర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. డివిజన్ల పునర్విభజన ఖాయంగా కనిపిస్తుండటం, రిజర్వేషన్ మారే అవకాశాలు ఎక్కువగా ఉండటం.. ప్రస్తుత కార్పొరేటర్లకు దడ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు డివిజన్​నే నమ్ముకుంటూ వస్తున్న ప్రజాప్రతినిధులు..ఈసారి రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుందా లేక వేరే ఇతర డివిజన్ చూసుకోవాల్సి వస్తుందోనంటూ గాబరా పడుతున్నారు.

redistribution-of-divisions-in-khammam-corporation
ఖమ్మం నగరపాలికకు నగారా
author img

By

Published : Jan 5, 2021, 10:06 AM IST

ఖమ్మం నగరపాలక సంస్థకు గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ.. డివిజన్ల పునర్విభజన సిట్టింగ్ కార్పొరేటర్లలో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతమున్న 50 డివిజన్లు 60 డివిజన్లవుతుండటం వల్ల రిజర్వేషన్లు మారే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటి వరకు డివిజన్ ను నమ్ముకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సిట్టింగు కార్పొరేటర్లు రిజర్వేషన్ మారితే ఏం చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎటూ తేల్చుకోలేక

ఎన్నికలు సమీపిస్తుండటం వల్ల ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు పెండింగ్​లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. పునర్విభజనలో ప్రస్తుతం వారికి బలమున్న ప్రాంతాలు మరో డివిజన్​లోకి వెళ్లే అవకాశం ఉన్నందున ప్రస్తుతం డివిజన్​లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా..? లేక రిజర్వేషన్ల అంశం తేలేవరకు వేచి చూడాలా అన్న ప్రశ్నతో సిట్టింగులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ఖమ్మం గద్దె కోసం తెరాస వ్యూహం

ఖమ్మం నగరపాలక సంస్థలో పాలకవర్గంగా ఉన్న తెరాసలో.. ప్రస్తుత పరిస్థితి సిట్టింగులను కలవరానికి గురిచేస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఫలితాలతో కాసింత నిరాశకు లోనైన తెరాస ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సొంత నియోజకవర్గంలో జరిగే ఎన్నిక కావడం వల్ల ఈ పోరు ఆయనకూ కీలకంగా మారింది. గత ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు గెలుచుకుని బల్దియా పీఠం దక్కించుకున్న తెరాస మరోసారి మేయర్ గద్దెపై గులాబీ జెండా ఎగురవేసేందుకు అన్నివిధాలా సన్నద్ధమవుతోంది. మరో 10 డివిజన్లు పెరగనుండటం వల్ల ఆశావహులు వారి ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రతికూలత ఉంటే ఔటే

ఇటీవల ఓ డివిజన్​లో అధికార పార్టీ డివిజన్ కార్యాలయ ప్రారంభం వివాదానికి దారితీసింది. స్థానిక కార్పొరేటర్​కు సమాచారం లేకుండానే డివిజన్ కార్యాలయం ప్రారంభించడం చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున పార్టీ నేతలు కొత్త డివిజన్ల బాధ్యతలు అప్పగించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతికూలత ఉన్న ప్రస్తుత కార్పొరేటర్లను పక్కనబెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

గెలుపు గుర్రాలకే టికెట్లు

జీహెచ్​ఎంసీలో కొంతమంది సిట్టింగుల పనితీరు బాగోలేదని తేలినా.. మళ్లీ వారికే టికెట్లు ఇచ్చి చేయి కాల్చుకున్న తెరాస ఇక్కడ ఆ పరిస్థితి ఉత్పన్నం కావద్దన్న భావనలో ఉంది. ఇటీవల కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య అధ్యక్షులతో జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామన్న మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు ఇందుకు మరింత ఊతమిస్తుండగా..సమర్థంగా పనిచేసిన వారందరికీ మళ్లీ అవకాశం దక్కుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సీట్ల త్యాగం తప్పదు!

ఓ వైపు నగరంలో ఎన్నికల ప్రచారానికి తెరలేపిన తెరాస.. డివిజన్ల వారిగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, ముఖ్య ప్రాంతాల్లో సభలకు శ్రీకారం చుట్టినా.. టికెట్లు ఎవరికి దక్కుతాయి...ఎవరికి దక్కవన్న చర్చే ప్రధానంగా ఆ పార్టీలో సాగుతుండటం మరో విశేషం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టికెట్లు ఖరారు చేస్తారంటూ తెరాస చెబుతున్న మాటలతో అధికార పార్టీ కార్పొరేటర్లలో సీట్ల త్యాగం తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.