ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Aug 30, 2020, 10:36 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని 94 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధిని ఏర్పాటు చేశారన్నారు.

sathupalli mla sandra venkataveeraiah distributed cmrf cheques in khammam district
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధిని ఏర్పాటు చేశారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని 94 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్​కు చెందిన జయమ్మకు తెరాస పార్టీ ప్రమాద బీమా రెండు లక్షల పరిహారంను ఎమ్మెల్యే అందించారు.

సీఎం సహాయనిధి ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. తెరాస పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల ప్రమాద బీమా అందించి ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్​ మహేష్, ఎంపీపీ దొడ్డ హైమావతి, ఆత్మ కమిటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రైతులకు మంచి రోజులు వచ్చాయి: మంత్రి నిరంజన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.