ETV Bharat / state

క్లినిక్​లు బంద్​ చేయాలని.. ఆర్​ఎంపీలకు కలెక్టర్​ ఆదేశాలు! - ఖమ్మం జిల్లా కలెక్టర్​

కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్​ఎంపీ వైద్యులు తమ క్లినిక్​లు బంద్​ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా తల్లాడలో రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్​ శాఖల అధికారులు ఆర్​ఎంపీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

RMP Doctors must close clinics in rural And city Area
క్లినిక్​లు బంద్​ చేయాలని.. ఆర్​ఎంపీలకు కలెక్టర్​ ఆదేశాలు!
author img

By

Published : Aug 3, 2020, 4:56 PM IST

ఖమ్మం జిల్లాలోని ఆర్​ఎంపీ వైద్యులు తమ క్లినిక్​లు వెంటనే బంద్​ చేయాలని జిల్లా కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్​ శాఖల అధికారులతో కలిసి ఆర్​ఎంపీ వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కరోనా విస్తారంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా క్లినిక్​లలో వైద్యం చేయడానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలకు మాత్రమే వైద్యం చేయాలని, ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స చేయడానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు కలెక్టర్​ తెలిపారు. మండల పరిధిలోని ఆర్​ఎంపీ వైద్యులంతా తప్పనిసరిగా పాలనాధికారి ఆదేశాలను పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్​ శ్రీలత తెలిపారు. రక్త పరీక్షా కేంద్రాలకు సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయని జిల్లా వైద్యాధికారి నవ్యకాంత్​ తెలిపారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.