ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామస్తులంతా కృత్రిమ రసాయన విగ్రహాలను నిషేధించారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించి ఆదర్శంగా నిలవాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలోని యువత ముందుకు వచ్చారు. గ్రామంలో 7 మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
తమ వంతుగా పర్యావరణాన్ని సంరక్షించాలనే ఉద్దేశ్యంతో మట్టి గణపతులను ప్రతిష్ఠించామని అర్చకులు స్పష్టం చేశారు.
'బుగ్గపాడు గ్రామమే ఇతరులకు ఆదర్శం'
భక్తి మాత్రమే కాదు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమే అంటున్నారు బుగ్గపాడు వాసులు. వారి పర్యావరణ పరిరక్షణ బాటలో ఇతర గ్రామాలు వచ్చే ఏడాదైనా నడిస్తే బాగుంటుంది.
ఇవీ చూడండి : గణేశ్ నిమజ్జనానికి ఎంఎంటీఎస్ సేవల పెంపు