ETV Bharat / state

సమస్యలు తీర్చాలని భారీ ప్రదర్శన

మంచి నీరు, కరెంట్ సరఫరా కల్పించాలని ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలో భారీ ప్రదర్శన జరిగింది. మూడేళ్లుగా పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నా.. అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Jan 21, 2021, 11:20 AM IST

protest for poor community to solve problems at khammam
సమస్యలు తీర్చాలని పేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. భక్తరామదాసు కళాక్షేత్రం నుంచి కలెక్టరేట్ వరకు ఈ ప్రదర్శన సాగింది.

జల్లా నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని వినోబా కాలనీలో మంచి నీరు, కరెంట్ సరఫరా కల్పించాలని ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జితిన్ కుమార్ డిమాండ్ చేశారు. మూడేళ్లుగా పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటే వారికి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకుండా.. అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వక్ఫ్​భూముల్లో ముస్లిం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి.. పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: భార్య, కుమార్తెను రాడ్డుతో కొట్టి చంపాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.