ETV Bharat / state

Ponguleti Latest Comments : 'ప్రజల గుండెల్లో నుంచి పొంగులేటిని, కాంగ్రెస్​ను ఎవరు వేరు చేయలేరు' - పొంగులేటి కామెంట్స్

Ponguleti Comments on BRS Party : ఖమ్మం జిల్లాలో జులై 2న కాంగ్రెస్​ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. దీనికి అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన విజయవంతం చేయనున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తనతో పాటు ప్రముఖ నాయకులు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సమక్షంలో చేరనున్నారని స్పష్టం చేశారు.

Ponguleti srinivas reddy
Ponguleti srinivas reddy
author img

By

Published : Jul 1, 2023, 7:34 PM IST

Ponguleti Fire on State Government : కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి తట్టుకోలేక అధికార పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సభను విఫలం చేయాలని బీఆర్​ఎస్​ అనుకుంటోందని విమర్శించారు. కానీ జనగర్జనను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి ఆర్టీసీ బస్సులు నమోదు చేయిస్తే.. ముందు ఇస్తానని చెప్పిన ఆర్టీసీ అధికారులు.. తరవాత బస్సులు అందుబాటులో లేవని అన్నారని మండిపడ్డారు. ఖమ్మం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వాహనాలు అద్దెకు తీసుకుంటే.. వాటినీ తనిఖీల పేరుతో అనుమతివ్వడం లేదన్నారు. కార్యకర్తలను, ప్రజలను ఎంత ఆపుదామని అనుకున్న ఆపలేరని తెలిపారు. ఖమ్మం నగరంలో తాగునీటి సరఫరా బంద్ చేశారని, జులై​ 2న విద్యుత్తు నిలిపి వేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Revanth Reddy on Khammam Public Meeting : 'ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఖమ్మం సభను విజయవంతం చేసి తీరతాం'

Posters to attack Ponguleti followers : పొంగులేటి ప్రధాన అనుచరుడు మువ్వా విజయ్ బాబును చంపేస్తామంటూ వాల్ పోస్టర్లు వేశారని.. గతంలోనూ కార్తీక్ అనే తన అనుచరుడిపై దాడి చేశారన్నారు. సభ జరిగే రోజు ఏ కార్యకర్తపైన దాడి జరిగితే.. తానే స్వయంగా ఘటన స్థలాన్ని చేరుకుని బదులు ఇస్తానని హెచ్చరించారు. సమావేశానికి వచ్చిన ప్రతి కార్యకర్తని కాపాడుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తామని చెప్పారు. రాజ్యం ఎవరి సొత్తు కాదని.. ఎప్పుడూ ఒక్కరే అధికారంలో ఉండరని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటికీ బదులిస్తామన్నారు. అధికార పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని.. ప్రజల గుండెల్లోంచి పొంగులేటిని, కాంగ్రెస్ పార్టీని ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్​ పార్టీని తీసుకువస్తారని ధీమా వ్యక్తం చేశారు.

"ఖమ్మంలో జరిగే సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. నగరంలో మంచి నీరు సరఫరా బంద్​ చేశారు. విద్యుత్​ నిలిపి వేయాలని చూస్తూన్నారు. చెక్​పోస్ట్​లను పెట్టి వాహనాలపై వచ్చే కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఎన్ని అవాంతరాలు పెట్టిన సభను విజయవంతం చేస్తాం. నా అనుచరులకు చంపేస్తామని పోస్టర్​లు అంటించారు. ఎటువంటి ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్​ బాధ్యత వహించాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ గెలుస్తుంది. అప్పుడు ఇబ్బంది పెడుతున్న ప్రతి నాయకుడు లెక్కలు తెలుస్తాం. పొంగులేటిని, కాంగ్రెస్​ పార్టీని ప్రజల గుండెల్లో నుంచి ఎవరు వేరుచేయలేరు."- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ

ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభను విజయవంతం చేస్తామన్న పొంగులేటి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.