ETV Bharat / state

'ఎన్​ఎస్​ఎస్​ క్యాంప్​ విద్యార్థికి సమాజం పట్ల అవగాహన పెంచుతుంది'

విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి ఎన్​ఎస్​ఎస్​ ఎంతగానో ఉపయోగపడుతుందని సత్తుపల్లి ఎంపీపీ హైమావతి తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్​ఎస్​ఎస్​ క్యాంపును ఆమె ప్రారంభించారు.

author img

By

Published : Feb 6, 2020, 8:51 PM IST

nss camp in khammam in sattupalli
'ఎన్​ఎస్​ఎస్​ క్యాంపు విద్యార్థికి సమాజం పట్ల అవగాహన పెంచుతుంది'

ఎన్ఎస్ఎస్ క్యాంపు.. విద్యార్థి మార్పుకు ఎంతగానో దోహదపడుతుందని సత్తుపల్లి ఎంపీపీ దొడ్డ హైమావతి అన్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం.. శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ఎంపీపీ ప్రారంభించారు.

శిబిరంలో భాగంగా గ్రామంలో శ్రమదానం, ఇంకుడు గుంతలు తవ్వడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఎంపీపీ హైమావతి తెలిపారు. మద్యం, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సులు, ర్యాలీలు విద్యార్థులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

శిబిరంతో గ్రామం పరిశుభ్రంగా ఉండడం, విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకోవాలని సత్తుపల్లి పురపాలక సంఘం ఛైర్మన్ కోసంపూడి రమేశ్​ సూచించారు.

ఇదీ చూడండి: 'వేసవి సమీపిస్తోంది... జాగ్రత్త వహించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.