ETV Bharat / state

Minister Puvvada: 'క్రాస్ బ్రీడ్​లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. కానీ తెరాస వాళ్లంతా ఒరిజినల్ బ్రీడ్స్'

Minster Puvvada Latest Press Meet: తెరాస అంటేనే ఒరిజినల్ బ్రీడ్ అని.. ఎన్ని క్రాసింగ్​లు జరిగినా.. క్రాస్ బ్రీడ్​లు వచ్చినా.. మా విజయంతోనే సమాధానమిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.

Minster Puvvada Latest Press Meet
తెరాస నేతల మీడియా సమావేశం
author img

By

Published : Dec 11, 2021, 1:28 PM IST

Minster Puvvada Latest Press Meet: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయకేతనం ఎగురవేస్తోందని తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నామ నాగేశ్వరరావు.. పలువురు ముఖ్యనేతలు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్సీ తాతా మధు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను అవలభిస్తోందని తెరాస లోకసభాపక్ష నేత నామ ఆరోపించారు. ప్రజల హక్కులను హరించేలా కేంద్ర విధానాలు ఉంటున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ఒకట్రెండు తప్పితే.. ఏ ఎన్నికలు పెట్టినా కూడా.. తెరాసనే విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నేతలు.. తెరాస విజయమే లక్ష్యంగా కృషి చేస్తారు. ఇప్పడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాత మధు మంచి ఆధిక్యంతో విజయం సాధిస్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతు వ్యతిరేక విధానాలు. ప్రజల హక్కులను కాలరాసేలా కేంద్రం విధానాలను అవలభిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను తెరాస వ్యతిరేకిస్తోంది. ధాన్యం సేకరణపై డిమాండ్ చేస్తే కేంద్రం పట్టించుకోవట్లేదు.

-ఎంపీ నామ నాగేశ్వరరావు

తెరాస అంటేనే ఒరిజినల్ బ్రీడ్..

ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్​సీఐ విధానం సరిగా లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ ఆరోపించారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. సింగరేణిలోని బ్లాక్స్ వేలం వేయటాన్ని సింగరేణి తరఫున, తెరాస పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయం. తెరాస విజయానికి పనిచేసిన అందరికి కృతజ్ఞతలు. భారీ మెజార్టీతో తెరాస విజయం సాధిస్తోంది. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తాతా మధుకి వచ్చే విజయం ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం చెప్తాం. అలాంటి ఇలాంటి మెజార్టీ కాదు. భారీ మెజార్టీ సాధిస్తాం. ఏ క్రాసింగైనా.. క్రాస్ బ్రీడ్​ అయినా వస్తుంటాయ్.. పోతుంటాయి. మాది అంతా ఒరిజినల్ బ్రీడ్. తెరాస అంటేనే ఒరిజినల్ బ్రీడ్. తెరాస విజయం పట్ల మాలో ఎలాంటి అభద్రతా భావం లేదు.

-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సమావేశం అనంతరం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన జవానులకు.. తెరాస నేతలు రెండు నిముషాలు మోనం పాటించి నివాళులు అర్పించారు.

మీడియా సమావేశంలో తెరాస నేతలు

ఇదీ చూడండి: Harish rao in Gandhi hospital : 'గాంధీ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.