ETV Bharat / state

వైరాలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ - వైరా వార్తలు

పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పర్యటించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో కనిపించిన పెంటకుప్పలను చూసి.. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Puvvada Tour In Waira
పారిశుద్ధ్య పనులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ
author img

By

Published : Jun 1, 2020, 3:43 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభించారు. నియోజకవర్గంలోని కొణిజెర్ల మండలం, తనికెళ్ల, వైరా మండలంలోని కొండకొడిమ గ్రామాల్లో మంత్రి కాలినడకన పర్యటించారు. కొండకొడిమ మార్గంలో రోడ్డు వెంట కనిపించిన పెంటకుప్పలు చూసి.. మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మండల ఎంపీడీవోపై మండిపడ్డారు. డ్రైనేజీలలో నీళ్లు నిల్వ ఉండడం చూసి... పల్లె ప్రగతి కార్యక్రమంలో మీరు చేసింది ఇదేనా అంటూ అధికారులను ప్రశ్నించారు. సభావేదికపై పంచాయితీ కార్యదర్శిపై మంత్రితో పాటు.. కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ మండిపడ్డారు. చిన్నపాటి వర్షం వస్తేనే నీళ్లు నిలిస్తే.. రేపు రేపు.. వరుసగా వర్షాలొస్తే.. ఎలా అంటూ కలెక్టర్​ ఆగ్రహించారు.

రహదారి వెంట పెంటకుప్పలు వేసిన వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్టే... ఊరు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అని కలెక్టర్​ ప్రజలకు గుర్తు చేశారు. గ్రామ ప్రజలను అడిగి పలు సమస్యలు తెలుసుకున్నారు. సభకు పద్దతిగా ప్రజలంతా మాస్కులు ధరించి రావడం గమనించిన కలెక్టర్​... ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కలెక్టర్​ సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ప్రణాళిక ప్రకారం రానున్న ఎనిమిది రోజులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతిలోని అంశాలన్నీ సకాలంలో పూర్తిచేసిన కొండకొడిమ సర్పంచిని మంత్రి అభినందించారు.

ఇదీ చూడండి: మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.