పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఖమ్మంలో జోరుగా సాగుతోంది. రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరఫున ఖమ్మంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నగరంలోని పలు డివిజన్లలో ఇంటింటికి తిరుగుతూ పల్లాకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 1.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు లక్షలాది ఉద్యోగ అవకాశాలను మిగతా రంగాల్లో కల్పించామని స్పష్టం చేశారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి: కృత్రిమ అవయవాల దాత.. విధివంచితుల పాలిట వెలుగుప్రదాత