ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక బాలికలు పాఠశాల మానేసిన సందర్భాలు అనేకమున్నాయి. అసలు ఆ మండలంలో విద్యార్థినిలు ఎందుకు పాఠశాలలు మానేస్తున్నారా అని 2016లో ఈటీవీ, ఈనాడు బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించి వార్తలను ప్రశారం చేసింది.
యూట్యూబ్లో ఈనాడు, ఈటీవీ కథనాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లాయి. సీజీఎస్టీతో పాటుగా ఒక స్వచ్ఛంద సంస్థతో సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో 2 మరుగుదొడ్ల యూనిట్లను నిర్మించి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. తమ బాధలు తీర్చిన ఈనాడు, ఈటీవీకి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు