ETV Bharat / state

లక్ష్యం లక్షల్లో ఉంటే... నాటినవి మాత్రం వేలల్లోనే...! - హరితహారం కార్యక్రమం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలికల్లో నత్తనడకన సాగుతోంది. ఖమ్మంతోపాటు మరో 7 మున్సిపాలిటీలు సగం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆపసోపాలుపడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించకపోవడం వల్ల నాటే మొక్కల లక్ష్యం లక్షల్లో ఉంటే... నాటినవి మాత్రం వేలల్లో ఉన్నాయి.

haritha haaram program  Implementing very slow in khammam district

author img

By

Published : Aug 9, 2020, 3:58 AM IST

లక్ష్యం లక్షల్లో ఉంటే... నాటినవి మాత్రం వేలల్లోనే...!

"పట్టణాల్లో హరితహారం జోరందుకోవాలి. గ్రామాల్లో మాదిరిగా పట్టణాల్లో చిట్టడవులు పెంచాలి. బడ్జెట్లో 10 శాతం మేర నిధులు హరితహారం కోసం ఖర్చు చేయాలి." జూలై 30న హైదరాబాద్​లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలికల అభివృద్ధి సమీక్షలో మంత్రి కేటీఆర్​ నిర్దేశించిన లక్ష్యం ఇది..! కానీ... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మొక్కలు నాటే యజ్ఞంలో పురపాలికలు లక్ష్యం చేరుకోలేక ఆపసోపాలు పడుతున్నాయి.

సగమే నాటారు...

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 8 పురపాలికలు ఉన్నాయి. ఒక్కో పురపాలిక లక్ష్యం.. లక్షల్లో ఉన్నా నాటిన మొక్కలు మాత్రం వేలల్లోనే ఉన్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 16 లక్షల మొక్కలు నాటాల్సిఉండగా.. 2 లక్షల వరకే నాటారు. వైరా పురపాలికలో 2.02 లక్షలకుగాను 20 వేలు, మధిరలో 3.7 లక్షలకు.....50 వేలు, సత్తుపల్లిలో 2.14 లక్షల లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 50 వేల వరకే మాత్రమే నాటారు. కొత్తగూడెం పురపాలికలో లక్ష్యం 5.18 లక్షలైతే... 2 లక్షలు, పాల్వంచలో 5.20 లక్షలకు గాను రెండున్నర లక్షలే పూర్తిచేశారు. ఇల్లెందు పురపాలిక లక్ష్యం 2.19 లక్షలు కాగా....లక్షా 30 వేలు, మణుగూరు పట్టణంలో 2.86 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా కేవలం లక్షన్నరే నాటారు.

'పూర్తి కాకపోతే చర్యలు తప్పవు...'

భద్రాద్రి జిల్లా పురపాలికల్లో హరితహారం ఆశాజనకంగానే సాగుతున్నా... ఖమ్మం జిల్లాలో తీవ్ర జాప్యం కనిపిస్తోంది. గ్రామాల్లో ప్రత్యేకంగా నర్సరీలు ఉండగా... పట్టణాల్లో అంతంతమాత్రంగా ఉన్నాయి. పల్లెల నుంచి మొక్కలు తెచ్చి నాటడం పాలకవర్గాలకు ఇబ్బందిగా మారుతోంది. అంతేకాకుండా పట్టణాల్లో అంతర్గత రహదారులన్నీ సీసీ రోడ్లుగా ఉండటం వల్ల మొక్కలు నాటేందుకు స్థలం దొరకట్లేదు. పురపాలికల్లో హరితహారం సాగుతున్న తీరుపై ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రెండు జిల్లాల అధికారులు, పురపాలక ఛైర్మన్లు, కమిషనర్లతో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లో లక్ష్యం పూర్తయ్యేలా పాలకవర్గాలే బాధ్యత తీసుకోవాలని...లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా జాగ్రత్తలు తీసుకోకపోతే.... అధికారులు, పాలకవర్గంపై చర్యలు తప్పవని పురపాలక చట్టం హెచ్చరిస్తుంది. దీంతో విరివిగా మొక్కలునాటేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. హరితహారంపై కరోనా సైతం ప్రభావం చూపుతోంది. వర్షాలు తగ్గితే మొక్కలు నాటడం వృథా అనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.