ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో చేపల వేట ప్రారంభమయింది. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మే 29 తెల్లవారుజామున చేపల వేట ఆరంభించారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు నెలరోజులుగా చేపల వేట ఆగిపోయింది. జిల్లాలో వైరా చేపలకు మంచి గిరాకీ ఉండడం వల్ల వైరా జలాశయానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున చేపల కోసం తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం కోసం వైరా జలాశయం దగ్గర లారీలు సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది పెన్ కల్చర్ విధానం అవలంబించడం వల్ల చేపలు మంచి సైజులో వచ్చాయి. ఒక్కో చేప ఐదు కిలోల వరకు ఉంది. దిగుబడులు పూర్తయ్యేవరకు నిరంతరాయంగా చేపల వేట, విక్రయం కొనసాగుతుందని ఎఫ్డీవో శివప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం