ఖమ్మం జిల్లా వైరాలోని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గోపాల మిత్రులు, పశువైద్య అధికారులతో రైతు అవగాహన సదస్సును నిర్వహించారు. పశుగణాభివృద్ధి రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ మంజువాణి ఈ సదస్సులో పాల్గొన్నారు. పశువుల గర్భధారణ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని మంజువాణి సూచించారు.
కృత్రిమ పశు గర్భధారణలో జాతీయ స్థాయిలో తెలంగాణ ముందంజలో ఉందని మంజువాణి అన్నారు. మొదటి గర్భధారణలో లక్ష్యం సాధించిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఆరుగురు గోపాల మిత్రులకు నగదు పారితోషికాలు అందజేశారు. అనంతరం కొనిజర్ల మండలం పల్లిపాడులో ఏర్పాటు చేసిన దూడల ప్రదర్శనను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పశుసంపద పెంపుదలకు కృషి చేయాలని సూచించారు.