Congress Jana Garjana Sabha in Khammam : కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. సభ విఫలం చేయాలని బీఆర్ఎస్ అనుకుంటోందని.. కానీ జనగర్జనను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బహిరంగ సభకు దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి ఆర్టీసీ బస్సులు నమోదు చేయిస్తే.. ఖరారైన తర్వాత అందుబాటులో లేవని చెప్పారన్నారు. ఖమ్మం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర చెక్ పోస్టులు పెట్టి వాహనాలు అడ్డుకోవాలని చూస్తున్నారన్నారని మండిపడ్డారు. తన ప్రధాన అనుచరుడు మువ్వా విజయ్‌ని చంపేస్తామని పోస్టర్లు వేశారని.. గతంలో కార్తీక్ అనే అనుచరుడిపై దాడి చేశారని పొంగులేటి విమర్శించారు.
Rahul Gandhi attended Congress Meeting in Khammam : ఖమ్మం వేదికగా ఆదివారం జరగనున్న జనగర్జన సభ చరిత్ర సృష్టించడం ఖాయమని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్ తెలిపారు. ఈ సభ కాంగ్రెస్ పునరేకీకరణ సభ కాదని.. తెలంగాణ పరిరక్షణ సభగా అభివర్ణించారు. రాష్ట్రంలో వచ్చే రాజకీయ మార్పులకు ఖమ్మం సభ నాంది కాబోతోందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. ఆ సభకి నేతలంతా కలసికట్టుగా సమన్వయంతో పనిచేస్తున్నారని మధుయాష్కీ తెలిపారు.
Rahul Gandhi telangana tour : రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ 'జనగర్జన' సభకు హాజరు
కర్ణాటక ఎన్నికల ఫలితాలు బలాన్ని ఇచ్చాయి : పార్టీలో నేతల మధ్య మంచి సమన్వయం ఉందని.. ఎవరి పని వారు చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలోని చాలా మంది నేతలు తమతో టచ్‌లో ఉన్నట్లు వివరించారు. ఖమ్మం సభ తర్వాత మిగతా వారి చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
"చట్టం బీఆర్ఎస్ పార్టీకి చుట్టమా.. కాంగ్రెస్ పార్టీకి శత్రువా..? ఎంత మంది కార్యకర్తలను దాడి చేస్తామని బెదిరిస్తారు. ఎందరిని చంపుతారో చంపండి. ఏ ఒక్క కార్యకర్త భయపడడు. నా కార్యకర్తలకు, నాకు ఏదైనా జరగరానిది జరిగితే దానికి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. మేము ప్రజాస్వామ్య బద్దంగానే పోరాటం చేస్తాం. మరో మూడు నెలలు తరవాత రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉందని స్పష్టంగా కనబడుతోంది. ఎవరైతే అధికార బలంతో చెలరేగిపోయిన అధికారులు శిక్షించాడానికి అర్హులు. వారు ఆ శిక్షను అనుభవిస్తారు."- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ
ఇవీ చదవండి :