సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పోలీసులు తెరాస కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర నాయకులు శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడికి నిరసనగా భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. డిపో రోడ్‌లోని ప్రభుత్వ విశ్రాంతి భవనం వద్ద నిరసన తెలుపుతున్న ఆపార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
దుబ్బాక నియోజక వర్గంలో భాజపాకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి తెరాస ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టించి అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజలు తగిన రీతిలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్.. ప్రగతిభవన్ వద్ద భారీగా బలగాలు