ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది శ్రమదానం చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న చెత్తను, ముళ్ల కంచెలను తొలగించారు. వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు సామూహికంగా శ్రమదానంలో పాల్గొన్నారు.
ప్రతి శాఖలో ఉద్యోగులు ఇదే స్ఫూర్తితో శ్రమదానం చేస్తే కార్యాలయాలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. కార్యాలయాలు శుభ్రంగా ఉంటే అందులో పనిచేసే వారికి ఆరోగ్యంతోపాటు ఆహ్లాదం కూడా ఉంటుందన్నారు.
ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య