కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. అనంతరం నందన వనంలో స్వామివారికి వసంతోత్సవం జరిపించారు.
వెయ్యేళ్ల క్రితమే కులాల అడ్డుగోడల్ని మహనీయుడు రామానుజాచార్యులు తొలగించారని చినజీయర్ స్వామి అన్నారు. భక్తి కలిగిన ప్రతి వ్యక్తి దేవాలయంలో పూజ చేసుకోవచ్చని సూత్రీకరించారని తెలిపారు. అందుకే ఆ మహనీయున్ని సమతామూర్తిగా పిలుచుకుంటామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఎండాకాలం ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ