ETV Bharat / state

తగ్గిన దిగుబడితో ఠారెత్తిస్తోన్న కూరగాయలు

వంట చేద్దామనుకున్న ఇల్లాలికి.. కాయగూరల్ని కొనేందుకు వెళ్లిన సగటు మనిషికి కిలోల విలువల్ని తెలుసుకుని కంగుతినే పరిస్థితి కరీంనగర్‌ జిల్లాలో కనిపిస్తోంది. మార్కెట్‌కు వెళ్లాలంటేనే నగరవాసులు, ఆయా పట్టణాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అమాంతం పెరిగిన ధరలతో మిర్చి ఘాటెక్కిస్తుంటే టమాటా ఠారెత్తిస్తోంది. ఏది కొనాలన్నా పావుకిలోకు రూ.20-25 పెట్టనిదే సంచిలోకి కూరలు రావడం లేదు.

author img

By

Published : Aug 29, 2020, 12:10 PM IST

తగ్గిన దిగుబడితో ఠారెత్తిస్తోన్న కూరగాయలు
తగ్గిన దిగుబడితో ఠారెత్తిస్తోన్న కూరగాయలు

కరోనా విపత్కర వేళ.. కూరగాయల ధరలు ప్రజలను గగ్గోలు పెట్టిస్తున్నాయి.. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో సామాన్యుడికి ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. వంట చేద్దామనుకున్న ఇల్లాలికి.. కాయగూరల్ని కొనేందుకు వెళ్లిన సగటు మనిషికి కిలోల విలువల్ని తెలుసుకుని కంగుతినే పరిస్థితి కరీంనగర్‌ జిల్లాలో కనిపిస్తోంది. మార్కెట్‌కు వెళ్లాలంటేనే నగరవాసులు, ఆయా పట్టణాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అమాంతం పెరిగిన ధరలతో మిర్చి ఘాటెక్కిస్తుంటే టమాటా ఠారెత్తిస్తోంది. ఏది కొనాలన్నా పావుకిలోకు రూ.20-25 పెట్టనిదే సంచిలోకి కూరలు రావడం లేదు.

కరోనా ప్రభావంతో అనుకున్న స్థాయిలో కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌, హుజురాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మార్కెట్లకు కూరగాయలు రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి గతంలో మాదిరిగా కూరగాయలు పట్టణాలకు చేరకపోవడంతో ఈ ప్రభావం ధరలపై పడుతుందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు. మరోవైపు హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే పలు కూరగాయాల దిగుమతులు గణనీయంగా తగ్గడంతోనూ వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీంతో ఆయా మార్కెట్లలో అవసరానికన్నా తక్కువగా ఇవి వస్తుండటంతో డిమాండ్‌ పెరిగింది. గడిచిన నెల రోజులుగా ఈ రకమైన ఇబ్బంది ఉండగా.. వారం నుంచి ఇది విపరీతమైంది.

ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా ప్రకారం సుమారుగా 5లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉండగా ప్రస్తుత ఉత్పత్తి సుమారుగా 1.20లక్షల మేర ఉండటంతో అదనపు భారం పడుతోంది. ఇంకా ఎంతలేదన్నా మూడున్నర లక్షల వరకు ఉత్పత్తి కొరత ఉంది. ఇదే సమయంలో ఇక కరీంనగర్‌ జిల్లాలోనూ సాగు విస్తీర్ణం ఏటికాయేడు తగ్గుతుండటంతో కూడా ఇబ్బంది పెరగుతోంది. సుమారుగా వెయ్యి హెక్టార్లతో సాగయ్యే కూరగాయాల సాగు గతేడాది నుంచి 800 హెక్టార్లకు తగ్గిపోవడంతోనూ కొరత ఏర్పడుతుంది. కూరగాయల సాగుపట్ల ఆసక్తి చూపిన రైతులకు గతేడాది ఆశించిన రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు అందడంలో ఇబ్బందులు కనిపించాయి. ఇటీవల మాత్రం తిరిగి అన్నదాతల్ని కూరగాయల సాగు దిశగా ప్రోత్సహిస్తుండటంతో సాగు విస్తీర్ణం ఈ వానాకాలంలో పెరుగుతోంది. దీంతో భవిష్యత్తులో కూరగాయల ఉత్పత్తి పెరిగితే ధరల రూపంలో ఎదురయ్యే అవాంతరాల్ని అధిగమించేందుకు అవకాశముంటుంది.

ధరల తీరుపై ‘దృష్టి’ పెడితే..!

కరీంనగర్‌ జిల్లాలో కూరగాయల ధరల విషయంలో సంబంధిత అధికారులు సరైన పర్యవేక్షణను పెంచాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్‌ శాఖతోపాటు ఇతర శాఖల సమన్వయం వీటి పర్యవేక్షణ విషయంలో ఉండాల్సి ఉంది. కొన్ని చోట్ల దళారులే ఉద్దేశపూర్వకంగా దిగుమతి కొరతను దృష్టిలో పెట్టుకుని ఇష్టానుసారంగా వీటి అమ్మాకాలను పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకమైన నిఘాను పర్యవేక్షణాధికారులు పెడితే అధిక మోతాదులో విక్రయాలకు అడ్డుకట్టపడే వీలుంటుంది. ఈ దిశగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనల్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.