ETV Bharat / state

కేంద్రంతో కేసీఆర్ కుమ్మక్కు: ఏఐటీయూసీ నేత సీతారామయ్య - సింగరేణి తాాజా వార్తలు

కేంద్రంతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని, కార్మికుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఏఐటీయూసీ నేత సీతరామయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని పేర్కొన్నారు.

singareni third day Singareni Strike at ramagundam singareni area-1 karimnagar district
కేంద్రంతో కుమ్మకై కార్మికుల మధ్య చిచ్చుకు కుట్ర: ఏఐటీయూసీ
author img

By

Published : Jul 4, 2020, 3:02 PM IST

సమ్మె విచ్ఛిన్నానికి తెరాస అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ప్రయత్నిస్తోందని ఏఐటీయూసీ నేత సీతరామయ్య ఆరోపించారు. కానీ కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడవ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండంలో సంపూర్ణంగా జరిగింది. రామగుండంలోని ఆర్‌జి 1,2,3లో కార్మికులెవరూ విధులకు హజరు కాలేదు. అత్యవసర సిబ్బంది తప్ప కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు.

గోదావరిఖని...

గోదావరిఖని... టూ ఇంక్లైయిన్ బొగ్గుగనిలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌ల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని... కేంద్రంతో సీఎం కేసీఆర్ కుమ్మకై కార్మికుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పుటికైన బొగ్గుగనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుపట్టిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు.. తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇదీ చూడండి: ఆదివాసీల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలి: కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.