ETV Bharat / state

Tamilisai : ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఆమోదంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: గవర్నర్ - telangana political news

గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కౌశిక్​ రెడ్డిని (Koushik Reddy) మంత్రివర్గం చేసిన సిఫార్సు పెండింగ్​లో ఉండడంపై గవర్నర్ తమిళిసై (Tamilisai ) స్పందించారు. కేబినెట్ చేసిన సిఫార్సును ఇంకా ఆమోదించకపోవడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎందుకు ఆలస్యం అయిందో కారణాలను వివరించారు.

governor tamilisai
governor tamilisai
author img

By

Published : Sep 8, 2021, 2:31 PM IST

Updated : Sep 8, 2021, 3:16 PM IST

తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని (Koushik Reddy) ఎమ్మెల్సీగా నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్​ (Tamilisai ) తెలిపారు. కౌశిక్‌రెడ్డి నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫార్సు చేసిందని చెప్పారు. ఆ సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్‌ తెలిపారు. సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నానని వివరించారు. గవర్నర్​గా రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్​భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో పాతిక్రేయులతో చిట్​చాట్​ చేశారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీగా కౌశిక్​ రెడ్డి అభ్యర్థిత్వం పెండింగ్​లో ఉందని గవర్నర్​ (Tamilisai ) సమాధానం ఇచ్చారు.

గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ సిఫార్సు చేసినప్పటికీ ఆ ఫైల్ తన వద్ద పెండింగ్​లో ఉన్నట్టు గవర్నర్​ తెలిపారు. ఆ స్థానాన్ని సామాజిక సేవ చేసిన వారికి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి చేసిన సేవలకు సంబంధించి తాను మరింత పరిశీలించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

'కౌశిక్​ రెడ్డి నియామకంపై మంత్రివర్గం సిఫార్సు చేసింది. మంత్రివర్గ సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. సామాజిక సేవ విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నాం. కౌశిక్​ రెడ్డి ఫైల్ పరిశీలనకు మరింత సమయం పట్టొచ్చు.'

- తమిళిసై సౌందర రాజన్​, గవర్నర్​

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరిన కౌశిక్‌రెడ్డిని నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మంత్రివర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఆమోదంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: గవర్నర్

ఇవీచూడండి: Kaushik Reddy: కేబినెట్​ సిఫార్సు చేసినా.. కౌశిక్​కు తప్పని ఎదురుచూపులు!

Last Updated : Sep 8, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.