Retired Teachers Free Education Karimnagar : కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. అందులో తొలుత ఉర్దూ మీడియం, ఆ తర్వాత తెలుగు, ఇటీవల ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉన్న పాఠశాలలో సదుపాయాల లేమి వెంటాడుతుండగా మరోవైపు ఉపాధ్యాయుల కొరత ఇబ్బందులకు గురిచేస్తోంది. సదుపాయాలు లేకపోవడంతో ఉర్దూ మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమం మాత్రమే కొనసాగుతోంది. సదుపాయాల లేమిని లెక్క చేయకుండా అందులో పాఠాలను మాత్రం ఉపాధ్యాయులు కొనసాగిస్తున్నారు.
అసలే ఉర్దూ మీడియం పాఠశాలల కొరత ఉండగా, అందులో నియామకాలు కూడా అంతంత మాత్రం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉపాధ్యాయులు 2018లో పదవీ విరమణ చేశారు. అయితే తాము పదవీ విరమణ చేస్తే విద్యార్థినుల పరిస్థితి ఏంటని ఆలోచించారు ఆ ఇద్దరు ఉపాధ్యాయులు. తాము ఇంట్లో కూర్చొని సమయం వృధా చేసే కంటే పిల్లలకు పాఠాలు బోధించడం మేలని భావించారు. తాము పదవీ విరమణ చేశామనే విషయాన్ని మరిచి ప్రతిరోజు పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
'నేను వ్యాయాయ ఉపాధ్యాయుడిని. ఇక్కడికి నేను 2011లో వచ్చాను. 2018లో రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాను. రెండు సంవత్సరాలు పీఈటీ పోస్ట్‌లో ఉన్నాను. తర్వాత పిల్లలకు హిందీ, తెలుగు బోధించడం జరుగుతుంది. పిల్లల ఉన్నతమైన భవిష్యత్ కోసం రిటైర్డ్ అయినా నా సేవలను వారికి అందిస్తున్నాను. అన్ని దానాలకంటే విద్యాదానం గొప్పదని గ్రహించి ఇలా రోజు వచ్చి పాఠాలు చెబుతున్నాను.' - రవూఫ్ అంజద్, విశ్రాంత ఉపాధ్యాయుడు
Foreign Education: 'స్టడీ ఇండియా పేరుతో విదేశీ విద్యను అభ్యసించే వారికి రుణాలు'
Karimnagar Retired Teachers Free Education : దాదాపు 200 మంది విద్యార్థినులు చదువుకుంటున్నా, ఉపాధ్యాయుల కొరత ఉండటంతో విద్యార్థినులు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. పాఠాలు ఏమాత్రం విసుక్కోకుండా అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పే వారని, పదవీ విరమణ చేసిన అనుకున్న క్రమంలో ఇద్దరు కూడా పాఠాలు బోధించడం ఆనందంగా ఉందని విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల గురించి తమ వంతుగా ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నా ప్రభుత్వపరంగా ముందడుగు పడాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు.
'నేను 2012లో ఇక్కడికి వచ్చాను. అప్పటినుంచి ఇక్కడే బోధిస్తున్నా. ఇక్కడే రిటైర్డ్ అయ్యాను. పిల్లలతో ఎంతగానో దగ్గరగా ఉంటాను. రిటైర్డ్ అయి ఇంట్లో ఎందుకు ఉండాలని అనిపించింది. అందుకే రిటైర్డ్ అయినా విరామం తీసుకోకుండా డైలీ వచ్చి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాను. పిల్లలు భవిష్యత్‌తో మంచి స్థాయికి చేరాలని కోరుతున్నాను. మా సేవలతో పిల్లలు ఉన్నతంగా ఎదగాలని భావిస్తున్నాను.' - సాదత్ ఫాతిమా, విశ్రాంత ఉపాధ్యాయురాలు
కష్టాల కడలిలో పాలమూరు ప్రభుత్వ వృతి విద్య కళాశాల
గ్రామానికి సర్పంచ్.. స్కూల్లో టీచర్.. చిన్నారుల విద్య కోసం మహిళ మల్టీటాస్కింగ్