కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులు పట్టుకుని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతో దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకతవకలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య