ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి
కాకతీయ కాలువలో రెండో మృతదేహం లభ్యం - అల్గునూరు కాకతీయ కాలువలో గల్లంతు
కరీంనగర్ జిల్లా అల్గునూరు కాకతీయ కాలువలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కాకతీయ కాలువలో రెండో మృతదేహం లభ్యం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరు కాకతీయ కాలువలో గురువారం సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. . పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం హుజురాబాద్ సమీపంలో అబ్దుల్ కరీం (27) మృతదేహం లభ్యం కాగా ఇవాళ మానకొండూర్లోని గట్టు దుద్దెనపల్లి కాకతీయ కాలువలో రిజ్వానుద్దీన్ (16) మృతదేహం దొరికింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని గట్టుకు తరలించారు. మృతులిద్దరూ మేనమామ, అల్లుడుగా పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి
TG_KRN_551_26_GALLANTHAINAMRUTHADEHAALULABYAM_AVB_TS10084
REPORTER: TIRUPATHI
PLACE: MANAKONDUR CONSTANCY
MOBILE NUMBER: 829 720 8099
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని అల్గునూరు కాకతీయ కాలువ లో గురువారం సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన కుటుంబ సభ్యులకు పెను విషాదాన్ని నింపింది. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం హుజురాబాద్ సమీపంలో ని కాకతీయ కాలువ లో అబ్దుల్ కరీం (27) మృతదేహం లభ్యం కాగా ఎట్టకేలకు ఈరోజు మానకొండూర్ లోని గట్టు దుద్దెనపల్లి కాకతీయ కాలువలో రిజ్వానుద్దీన్ (16) మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని గట్టు కు తరలించారు. ఇరువురు మేనమామ, అల్లుడుగా పోలీసులు వెల్లడించారు. కరీంనగర్ లో ఏ ఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రియాజ్ తన బావమరిది మృతదేహం లభ్యమై తన కుమారుడు రిజ్వానుద్దీన్ మృతదేహం లభించకపోవడంతో అల్గునూరు కాలువ వద్ద మీడియాతో అర్థ నాదాలు పెట్టుకున్నాడు. చివరి సారి తన కుమారుడి మొహాన్ని చూసుకొని అంత్యక్రియలు జరిపేందుకు మీడియా సహకారం కావాలని తను మాట్లాడిన వీడియోను వైరల్ చేయాలని ప్రాధేయపడ్డాడు. తన కుమారుడి మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.