భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. కరోనా కట్టడికి తన వంతు సాయం చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నుంచి కోటి రూపాయలు, నెల జీతాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు. ఇప్పటికే కరీంనగర్ లోక్‌సభ పరిధిలో కరోనా కట్టడికి రూ.50 లక్షలు అందించినట్లు పేర్కొన్నారు.
తన పిలుపు మేరకు రాష్ట్రంలోని భాజపా కార్యకర్తలంతా పీఎం కేర్స్‌కు విరాళాలు అందించినట్లు బండి సంజయ్ వివరించారు. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీచూడండి: ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన