రాష్ట్రంలో రేపటి నుంచి పేదలకు ఉచితంగా పదికిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లో తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటించిన ఐదు కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు అందజేస్తుందని ప్రకటించారు.
కేంద్రం కేవలం ఆహారభద్రత కార్డుదారులకే ఇస్తుందన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. దీనితో 2 కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం జులై నుంచి నవంబర్ వరకు ఇస్తామని స్పష్టం చేశారు.
సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నెలకు అవసరమని అన్నారు. కానీ ఇప్పుడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో అదనంగా ఇవ్వడం వల్ల 2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని తెలిపారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ