తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలకు పెద్దపీట వేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐక్య క్రిస్‌మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన దుస్తులను నిరుపేదలకు పంపిణీ చేశారు.
మనదేశ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవన్నారు. క్రిస్‌మస్ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకుండా, ప్రేమను పంచిందన్నారు. చర్చీలు నిరుపేదలకు విద్య, వైద్యాన్ని అందించాయని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలను జరుపుకోవాలన్నారు.
ప్రజలకు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం శ్యాం, ఎంపీపీ మమత, పాస్టర్లు, కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ప్లాస్టిక్ బబుల్'లో శాంటాక్లాస్ సందడి