కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సారెను సమర్పించారు.
స్వామిని సూర్యవాహనంపై ఎక్కించి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవిందనామాలు స్మరిస్తూ ఊరేగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వెంకన్న కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం